న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌తో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇండియా కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ రియాక్ట్ అయ్యింది. అక్రమ రీతిలో నిఘా పెట్టడం దేశద్రోహమే అవుతుందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. మోదీ సర్కార్ ఎందుకు శత్రువులా వ్యహరించిందని, దేశ పౌరుల మీదే యుద్ధ ఆయుధాన్ని ఎందుకు వాడినట్లు ఆయన తన ట్విట్టర్లో ప్రశ్నించారు. పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్‌తో అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అవుతుందని, చట్టం కన్నా ఎవరూ గొప్ప కాదు అని, ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన నివేదికపై కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.
Why did Modi Govt act like the enemies of India and use a warfare weapon against Indian citizens?
— Mallikarjun Kharge (@kharge) January 29, 2022
Illegal snooping using Pegasus amounts to treason. No one is above the law and we will ensure that justice is served.https://t.co/qTIqg3yNdq