చెన్నై: ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ మితేశ్ ఖాప్రాకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన కృత్రిమ మేధ (ఏఐ)లో అత్యంత ప్రభావశీలురు 100 మందిలో ఒకరిగా ఆయన నిలిచారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ల సరసన చోటు దక్కించుకున్నారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్లో పరిశోధన చేసినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా ఆయన పరిశోధన భారతీయ భాషలపై సాగింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో చాలా మంది ఏఐ కంపెనీలను నడుపుతున్నవారే.