న్యూఢిల్లీ: విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించి ఆత్మహత్యలను నిరోధించడానికి పలు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఐఐటీ గువాహటి నిర్ణయించింది. కొత్త విద్యార్థులు బోధన సిబ్బందితో కలసి మార్నింగ్ వాక్కు వెళ్లేలా చేయడం, తప్పనిసరిగా కౌన్సిలింగ్ నిర్వహించడం, వైద్య పరీక్షలు నిర్వహించడం, ఒత్తిడి తట్టుకొనే కార్యశాలలను నిర్వహించడం వంటివి చేపట్టాలని ఐఐటీ యాజమాన్యం నిర్ణయించింది. ఇటీవల కొందరు విద్యార్థుల ఆత్మహత్యపై మిగతా స్టూడెంట్స్ ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.