గువాహటి: ఐఐటీ గువాహటి అకడమిక్ అఫైర్స్ డీన్ కేవీ కృష్ణ రాజీనామా చేశారు. కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ గదిలో సోమవారం ఉరివేసుకుని కనిపించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థులు సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఈ క్యాంపస్లో నలుగురు విద్యార్థులు మరణించారని కొందరు చెప్పారు.