న్యూఢిల్లీ: భారత్లోని యూనివర్సిటీల్లో సుస్థిరత అంశంలో ఐఐటీ ఢిల్లీ అగ్ర స్థానంలో నిలిచింది. క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్-2025లో 255 స్థానాలు ఎగబాకి 171 స్థానానికి చేరుకుంది. మంగళవారం ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఈ జాబితాలో 78 భారత విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కింది.
దేశంలోని టాప్ టెన్ విద్యా సంస్థల్లో తొమ్మిది తమ ర్యాంకులను మెరుగుపరుచుకోగా, కొత్తగా 21 సంస్థలు స్థానం దక్కించుకొన్నాయి. పర్యావరణ ప్రభావం అంశంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్ టాప్-100లో చోటు సంపాదించాయి. ఐఐఎస్సీ, బెంగళూరు పర్యావరణ విద్యలో టాప్-50లో చోటు దక్కించుకుంది. భారత యూనివర్సిటీలు సుస్థిరత అంశంలో చూపుతున్న చొరవను క్యూఎస్ ర్యాకింగ్స్ ప్రశంసించింది.