ముంబై: దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో ఒకటైన ‘ఐఐటీ-బాంబే’ పేరును అధికారికంగా మార్చాలని మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయించింది. పేరు మార్పుపై ప్రధాని మోదీ, కేంద్ర విద్యామంత్రికి లేఖ రాయబోతున్నట్టు సీఎం ఫడ్నవీస్ బుధవారం తెలిపారు. గత సోమవారం ఐఐటీ-బాంబే వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ‘ఐఐటీ-బాంబే పేరు ముంబైగా మార్చలేదు కదా! హమ్మయ్య!’ అని అన్నారు. జితేంద్ర సింగ్ మహారాష్ట్రను అవమానించారంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన తీవ్ర విమర్శలకు దిగింది. రాష్ట్ర బీజేపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.