న్యూఢిల్లీ: జాబ్ మార్కెట్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఐఐటీ బాంబే నుంచి లేటెస్ట్గా వచ్చిన గ్రాడ్యుయేట్లలో 36 శాతం మందికి ఉద్యోగాలు లేవు! 2024వ సంవత్సరంలో ప్లేస్‌మెంట్స్ కోసం దాదాపు 2,000 మంది నమోదు చేయించుకున్నారు. వీరిలో 712 మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు.
ఈ కథనాలపై ఐఐటీ-బాంబే స్పందిస్తూ ప్లేస్మెంట్ ప్రాసెస్‌లో 57.1 శాతం మంది ఉద్యోగాలు పొందినట్లు తెలిపింది. 12.2 శాతం మంది ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లారని, 8.3 శాతం మంది పబ్లిక్ సర్వీస్‌లో కెరీర్స్‌ను ఎంపిక చేసుకున్నారని చెప్పింది. 10.9 శాతం మంది ఐఐటీ-బాంబేకు వెలుపల ఉద్యోగాలు పొందారని, 1.6 శాతం మంది స్టార్టప్‌లను ప్రారంభించారని, కేవలం 4.3 శాతం మంది మాత్రమే తమ కెరీర్ గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని వివరించింది.