న్యూఢిల్లీ, జూన్ 5: ప్రపంచంలోని టాప్-150 యూనివర్సిటీల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ స్థానం సంపాదించుకున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) 13వసారి టాప్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ మేరకు లండన్‌కు చెందిన హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిస్ట్ క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 బుధవారం ర్యాంకులను విడుదల చేసింది. నిరుడు 149వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే ఈసారి 31 ర్యాంకులు మెరుగుపరుచుకుని 118వ స్థానానికి ఎగబాకింది. ఐఐటీ ఢిల్లీ 47 పాయింట్లు మెరుగుపరుచుకుని 150వ ర్యాంకులో నిలిచింది.