కోల్కతా: భారత ఎన్నికల కమిషన్కు (ఈసీఐ) బీజేపీ ఆదేశాలు ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రానున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి ఒక్క నిజమైన ఓటరు పేరు తొలగించినా సహించబోనని ఆమె హెచ్చరించారు. మంగళవారం బొంగావ్లో సర్కి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీనుద్దేశించి మమత ప్రసంగిస్తూ బీహార్ ఎన్నికలలో బీజేపీ చేసిన కుట్రను ఎవరూ చూడలేకపోయారన్నారు. అయితే అది బెంగాల్లో సాధ్యం కాదన్నారు. బెంగాల్లో నన్ను కాని, నా ప్రజలను కాని దెబ్బతీయాలని చూస్తే దేశవ్యాప్తంగా పర్యటించి యావద్దేశాన్ని షేక్ చేస్త్తా అంటూ ఆమె బీజేపీని హెచ్చరించారు. నన్ను లక్ష్యంగా మీరు చేసుకుంటే అది నా ప్రజలపై జరిగిన వ్యక్తిగత దాడిగా భావిస్తా. ఆ తర్వాత యావద్దేశాన్ని షేక్ చేస్తా. ఎన్నికల తర్వాత దేశమంతా పర్యటిస్తా అని మమత తెలిపారు.