బెంగుళూరు: కర్నాటకలో ఇవాళ్టి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలుపెడుతున్నారు. ఓటర్ల నమోదు కోసం సర్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) వార్నింగ్ ఇచ్చారు. ఓటు హక్కును కోల్పోతే.. ప్రభుత్వం పథకాల్లోనూ లబ్ధిని కోల్పోతారని ఆయన తన హెచ్చరికలో పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల వద్ద తమ ఓట్లను నమోదు చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఓటు హక్కు అంటే జీవించే హక్కు అని, పశ్చిమ బెంగాల్ సర్కారు ఓ ఆదేశం జారీ చేసిందని, సర్ ఆధారంగా అనర్హులైన ఓటర్లను రేషన్ లబ్ధి నుంచి డిలీట్ చేయాలని ఆదేశించిందని, ఇలాంటి పద్ధతులను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని, ఒకవేళ మీరు ఓటు హక్కును కోల్పోతే, అప్పుడు ప్రభుత్వ లబ్ధి కూడా కోల్పోతారని ఆయన అన్నారు. కర్నాటకలో ఇవాళ్టి నుంచి జూలై 29వ తేదీ వరకు సర్ ప్రక్రియను నిర్వహించనున్నారు. సర్కు సహకరించే భాగంగా ప్రజలకు పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్లను జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. రెవన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చామని, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆ ద్రువపత్రాలను పొందవచ్చు అన్నారు. సుమారు 5.5 కోట్ల మంది ఓటర్ల జాబితాను రివిజన్ చేయనున్నట్లు కర్నాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అన్బుకుమార్ తెలిపారు. సర్ కోసం 59వేల మంది బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు.