Diabetes | న్యూఢిల్లీ: ఆహారం నెమ్మదిగా నమిలి తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అన్నల్స్ ఆఫ్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబొలిజం జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఆహారాన్ని వేగంగా తినేవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. అంటే ఇది టైప్-2 మధుమేహానికి సూచిక అన్నమాట!
శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు సరైన రీతిలో ప్రతిస్పందించనపుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలడం ద్వారా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చు, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచుకోవచ్చు.