watch: మోదీ, యోగి కంటే గొప్ప వ్యక్తులు ఉన్నారనే వారు దేశద్రోహులు.. బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు
BJP MP Mahesh Sharma | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు.
లక్నో: బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ (BJP MP Mahesh Sharma) నోయిడా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఎన్నికల ప్రచారం సందర్శంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారని ఎవరైనా నమ్మితే వాళ్లు దేశద్రోహులని అభివర్ణించారు. ‘మోదీ, యోగిని సొంత వారిగా భావించని వారు తమ తండ్రులను కూడా తమవారిగా పరిగణించరు. మోదీ, యోగి కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారని ఎవరైనా నమ్మితే వాళ్లు దేశద్రోహులే’ అని అన్నారు.
కాగా, బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ వివాదస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయనపై మండిపడ్డారు. తన తండ్రి స్థానాన్ని మోదీ లేక యోగి ఎప్పటికీ భర్తీ చేయలేరని ఒకరు వ్యాఖ్యానించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
राजपूतों की #भाजपा से नाराजगी पर #नोएडा से भाजपा प्रत्याशी डॉक्टर महेश शर्मा के भाषण का एक वीडियो वायरल हो रहा है।
जो योगी मोदी को अपना नहीं समझते वह अपने बाप को भी अपना नहीं समझते।
अगर योगी मोदी से ज्यादा कोई अपना है और अपना कहने की बात करता है तो वह देश का गद्दार है: महेश… pic.twitter.com/nsSVdrxsDB— Mamta Tripathi (@MamtaTripathi80) April 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

