Uddhav Thackeray | మనం ఈసారి తప్పుచేస్తే.. దేశంలో నియంతృత్వమే: ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray | మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ముంబై: మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సోమవారం తూర్పు ముంబైలోని కుర్లాలో జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికల గురించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. భారతదేశ ద్వారానికి నియంతృత్వం చేరిందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘దేశం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. దేశాన్ని ఎవరు కాపాడతారు? ఈసారి మనం తప్పు చేస్తే దేశంలో నియంతృత్వం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, దేశానికి మరో స్వాతంత్ర్యం కావాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం మనం పోరాడాం. ఇప్పుడు ఈ స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాడాలి. నేను చేయగలిగినదంతా చేస్తా. దేశంలో గందరగోళ వాతావరణం ఉంది. మన తలుపు వరకు నియంతృత్వం వచ్చింది. మనమంతా దానిని ఆపాలి’ అని అన్నారు.
మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని ప్రజలను ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ‘నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చాను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. నాకు నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది. వారు గర్వించేలా చేయాలనుకుంటున్నా. దేశం కోసం.. మీ ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చా’ అని అన్నారు. జైన మతాచార్యుల ఆశీర్వాదాన్ని ఆయన కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

