Adhir Ranjan | టీఎంసీకి పఠాన్‌పై గౌరవం ఉంటే రాజ్యసభకు పంపాల్సింది: అధిర్ రంజన్ చౌధరి
Adhir Ranjan | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బెర్హంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బెర్హంపూర్ ప్రస్తుత ఎంపీ అధిర్ రంజన్ చౌధరి స్పందించారు. నిజంగా యూసఫ్ పఠాన్‌ను గౌరవించాలనే ఉద్దేశం టీఎంసీకి ఉంటే ఆయనను రాజ్యసభకు పంపాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
Adhir Ranjan: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బెర్హంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బెర్హంపూర్ ప్రస్తుత ఎంపీ అధిర్ రంజన్ చౌధరి స్పందించారు. నిజంగా యూసఫ్ పఠాన్‌ను గౌరవించాలనే ఉద్దేశం టీఎంసీకి ఉంటే ఆయనను రాజ్యసభకు పంపాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ బయటి వ్యక్తులను బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపిందని, వారికి బదులుగా యూసఫ్ పఠాన్‌ను పంపితే బాగుండేదని అధిర్ రంజన్ అభిప్రాయపడ్డారు.
నిజంగా యూసఫ్ పఠాన్ విషయంలో టీఎంసీకి సదుద్దేశమే ఉంటే తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆయన కోసం ఒక సీటు కావాలని ఇండియా కూటమిని అడగాల్సిందని అధిర్ రంజన్ అన్నారు. కేవలం సామాన్య ఓటర్లను మాయచేసి బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసమే యూసఫ్ పఠాన్‌ను బెర్హంపూర్ నుంచి బరిలో దించారని ఆయన ఆరోపించారు. తన లాంటి నాయకురాలిని ఎవరూ నమ్మగూడదనే విషయాన్ని ఇవాళ మమతాబెనర్జి రుజువు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలో కొనసాగితే ప్రధాని మోదీ బాధపడుతారని మమతాబెనర్జీ భయపడుతున్నారని అధిర్ రంజన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు తాను ఇండియా కూటమి నుంచి పక్కకు జరగడం ద్వారా మమత పీఎంవోకు ‘నా వల్ల మీరు ఎలాంటి బాధపడొద్దు’ అనే సందేశం ఇచ్చారని, తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటం లేదని చెప్పకనే చెప్పారని ఆయన విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

