House Demolition: ఇండ్లు కూల్చివేస్తే.. మరో ఇళ్లు కట్టివ్వాలి
House Demolition: ఒకవేళ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఇండ్లను కూల్చివేస్తే, వారికి పీఎం ఆవాస్ యోజన కింద కొత్త ఇండ్లను కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిమాండ్ చేసింది. ఢిల్లీ మంత్రి అతిషి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సర్కారుకు చెందిన ఏజెన్సీలు గత ఏడాది నుంచి అనేక చోట్ల ఇండ్లను కూల్చివేశాయని అన్నారు.
న్యూఢిల్లీ: గత ఏడాది కాలం నుంచి ఒకవేళ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఇండ్లను కూల్చివేస్తే(House Demolition), వారికి పీఎం ఆవాస్ యోజన కింద కొత్త ఇండ్లను కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిమాండ్ చేసింది. ఢిల్లీ మంత్రి అతిషి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సర్కారుకు చెందిన ఏజెన్సీలు గత ఏడాది నుంచి అనేక చోట్ల ఇండ్లను కూల్చివేశాయని అన్నారు. డీడీఏ, ఏఎస్ఐ, రైల్వేస్ లాంటి సంస్థ కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాయన్నారు. సిల్కియారా టన్నెల్ రెస్క్యూ బృందంలో పాల్గొన్న ఓ ర్యాట్ హోల్ మైనర్ ఇంటిని బుధవారం డీడీఏ అధికారులు కూల్చివేశారని, అతనికి కొత్త ఇంటిని కట్టి ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ర్యాట్ హోల్ మైనర్‌కు కొత్త ఇళ్లు కేటాయిస్తామని గవర్నర్ చెప్పారని, దాన్ని స్వాగతిస్తున్నామని, అయితే గత ఏడాది నుంచి ఇండ్లు కోల్పోయిన వారికి కూడా కొత్త ఇండ్లను ప్రధాని ఆవాస్ యోజన కింద ఇవ్వాలని మంత్రి కోరారు. ఖాజూరి ఖాస్ ఏరియాలో ఉన్న ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్ ఇంటిని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేసింది. ఆ డ్రైవ్ సమయంలో అనేక మంది ఇండ్లను కూడా కూల్చివేశారు. ఇళ్ల కూల్చివేసిన సమయంలో ఆ మైనర్ తన భార్యా పిల్లలతో కలిసి రోడ్డుపై ఉండిపోయాడని, పొరుగు ఇంటి వాళ్ల అతని ఆహారం అందజేసినట్లు మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

