Karnataka | కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి (Karnataka CM) పీఠంపై డీకే శివకుమార్ (DK Shivakumar), సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారని సమాచారం. ఈ క్రమంలో అక్టోబర్‌లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా కర్ణాటక పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ గందరగోళం వేళ ఉప ముఖ్యమంత్రి డీకేకి సన్నిహితుడిగా పేరొందిన ఓ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ‘మార్పు’ కోరుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ (Iqbal Hussain) మాట్లాడుతూ.. ‘నేను ఒక్కడిని కాదు.. మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారు. 100 మందికిపైగా ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారు. వారిలో చాలా మంది మార్పు కోసం ఎదరుచూస్తున్నారు. మంచి పాలన కోరుకుంటున్నారు. సిద్ధరామయ్యను తొలగించి.. డీకే శివకుమార్‌ను సీఎంని చేయాలి. ఆయన పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి అందరూ చూశారు. అందుకే మోజారిటీ ప్రజలు ఆయన్నే సీఎంగా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశం గురించి నేను సుర్జేవాలాతో మాట్లాడతాను. ఇప్పుడు మార్పు జరగకపోతే.. 2028లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోలేదు. ప్రస్తుతం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీఎం మార్పు చాలా అవసరం’ అని అన్నారు.
Also Read..
Online Transfers: ఐఎంపీఎస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లపై కొత్త ఛార్జీలు..
Encounter | దండకారణ్యంలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
Sugar Mill | షుగర్ మిల్‌లోకి పోటెత్తిన వరద.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార