న్యూఢిల్లీ: ‘ఒకవేళ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పాలన సాగించాలా?’ అని తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. శుక్రవారం వారితో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అధికారం చేపట్టిన 49వ రోజునే పదవికి రాజీనామా చేశానని, తనకు పదవీ కాంక్ష లేదని అన్నారు. అయితే బీజేపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలకు చిక్కకూడదని భావిస్తున్నానని, ఈ విషయంలో నేతలు ఢిల్లీ ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. తనను జైలుకు పంపినా.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేదని చెప్పారు.