హోలీ అంటే హోరాహోరీగా సాగే రంగుల కేళి! సెకండ్ వేవ్ భయంతో ఈసారి సందడి తగ్గింది. కాబట్టి, వీధుల్లోకి వెళ్లే ఆలోచన పక్కన పెట్టి ఇంట్లోనే స్నేహితులు, చుట్టాలతో వర్చువల్ హోలీ ఆడేయండి. ఇంట్లో కూర్చునే అందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పండి. గత సంబురాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోండి. ఫొటోలను రకరకాల రంగులు, థీమ్‌లతో డబ్ చేసే యాప్‌లు బోలెడున్నాయి. ఓ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఆత్మీయుల ఫొటోలకు రంగులు పులిమేయండి. మిఠాయిలు కానుకగా పంపి ఆశ్చర్యానికి గురిచేయండి. ఆ ఆనందంలో వారి మొహం సప్త వర్ణాలతో మెరిసిపోయే దృశ్యాన్ని ఊహించుకోండి. ఇది కదా.. అసలైన హోలీ!