రూ.10.50కోట్ల విలువైన 18కిలోల బంగారాన్ని పట్టుకున్న డీఆర్ఐ
gold seized | ఇండియన్ కోస్ట్‌గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.
న్యూఢిల్లీ : ఇండియన్ కోస్ట్‌గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు. శ్రీలంక నుంచి సముద్రమార్గంలో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కోస్ట్‌గార్డ్, చైన్నై డీఆర్ఐ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రూ.10.50 కోట్ల విలువైన 17.74 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
ఈ నెల 7 నుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఇంటర్‌సెప్టర్ బోట్ (IB) C-432లో ప్రత్యేక నిఘా బృందాన్ని మోహరించింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో రెండు రోజులుగా నిఘా వేయగా.. ఈ నెల 8న అనుమానాస్పద పడవ కదలికలను గుర్తించారు. కోస్ట్‌గార్డ్ పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత పడవను ఆపి తనిఖీలు నిర్వహించగా ఏమీ దొరకలేదు. అయితే, అడ్డుకునే సమయంలో నీటిలో పడవేసి ఉంటారన్న అనుమానంతో.. సముద్రంలో డైవింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిషింగ్ బోట్‌ను స్వాధీనం చేసుకోవడం పాటు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది..
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- DRI
- Gold Seized
- ICG
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

