న్యూఢిల్లీ: ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఇకపై ఏటా మూడుసార్లు ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ కోర్సుల పరీక్షలను నిర్వహించనుంది. ఈ నెల 7న ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటివరకు ఏటా రెండుసార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు.
‘ఇంటర్మీడియెట్, ఫౌండేషన్ కోర్సులను జనవరి, మే/జూన్, సెప్టెంబర్లలో నిర్వహించనున్నాం’ అని ఐసీఏఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.