న్యూఢిల్లీ : ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో తమ కంపెనీలో వేలాది ఉద్యోగాల కోతలు ఉంటాయని ఐబీఎం మంగళవారం ప్రకటించింది. ఏఐతో సంబంధం కలిగిన క్లౌడ్ డిమాండ్ నుంచి ప్రయోజనం పొందడానికి, అధిక లాభం కలిగిన సాఫ్ట్వేర్ విభాగంపై దృష్టి సారించడం కోసం తమ సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది.
‘మేం తరచూ మా సిబ్బంది సంఖ్యను సమీక్షించుకుంటాం. సమయం వచ్చినప్పుడు తిరిగి సమతుల్యం చేసుకుంటాం’ అని ఐబీఎం ఒక ప్రకటనలో తెలిపింది.