న్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ షాకిచ్చింది. ఆ దేశ జాతీయులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గ్లోబల్ ఎయిర్లైన్డ్ బాడీ ఐఏటీఏ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) తెలిపింది. చైనాలో విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 22వేల మంది విద్యార్థుల కరోనా నేపథ్యంలో అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్నారు. మళ్లీ చైనాకు వెళ్లేందుకు సిద్ధమవగా.. వారి రాకను చైనా తిరస్కరించిన డ్రాగన్ కంట్రీ.. పాక్, శ్రీలంక, థాయిలాండ్ నుంచి వచ్చే విద్యార్థులను మాత్రం చైనాకు ఆహ్వానించింది. గతంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ అయిన సమయంలో విదేశాంగ మంత్రి జై శంకర్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరారు.
అయినా చైనా నుంచి ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో ఘాటైన సమాధానం ఇచ్చేందుకే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 20న జారీ చేసిన సర్కులర్లో.. ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) చైనా పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు’ అని పేర్కొంది. అయితే, ఇదే సమయంలో భూటాన్, మాల్దీవులు, నేపాల్ జాతీయులు, భారత్ జారీ చేసిన నివాస అనుమతి ఉన్న వారు, భారత్ జారీ చేసిన వీసా, ఈ-వీసా ఉన్న వారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ లేదా బుక్లెట్ ఉన్నవారు, పీఐఓ కార్డ్ (PIO Card) ఉన్నవారు, దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు మాత్రమే భారత్లోకి అనుమతించబడుతారని స్పష్టం చేసింది.