బెంగళూరు: కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి తన భూమిని ఆక్రమించారంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. యెలహంకలోని తన వ్యవసాయ భూమిని సింధూరి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బంధువు మధుసూధన్ రెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై 2022లోనే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో లోకాయుక్తను ఆశ్రయించినట్టు చెప్పారు.