న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్‌ను విజిట్ చేసిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాలో ఆయన పర్యటించారు. అక్కడ మహిళా సివిల్ సర్వీస్ ఆఫీసర్ విశాఖా యాదవ్(Vishakha Yadav) ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ మహిళా ఆఫీసర్ మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ ఆఫీసర్ ఎవరన్న దాని గురించి ఆరా తీస్తున్నారు.
విశాఖా యాదవ్ ఐఏఎస్ ఆఫీసర్. అరుణాచల్‌లోని పాపుమ్ పరే జిల్లాలో డిప్యూటీ కమీషనర్‌గా ఆమె పోస్టింగ్‌లో చేరారు. ప్రధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నది. మోదీకి వెల్కమ్ చెప్పడం గర్వంగా ఫీలవుతున్నట్లు ఆమె తన పోస్టులో వెల్లడించింది.
సివిల్ సర్వీస్‌లోకి రాకముందే విశాఖా యాదవ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. లక్షల్లో జీతం ఆర్జించారు. కానీ యూపీఎస్పీ పరీక్ష రాయాలన్న సంకల్పంతో ఆమె ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. కోచింగ్ తీసుకోకుండానే సివిల్ సర్వీస్ పరీక్షలో ఆమె ఆల్ ఇండియా ఆరవ ర్యాంక్ సాధించింది.
ఢిల్లీలో పుట్టిన యాదవ్.. ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి ముందు ఇంజినీరింగ్ చదివింది. ఢిల్లీ టెక్నోలాజికల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరులోని సిస్కోలో ఉద్యోగం చేసింది. అయితే ఐఏఎస్ కావాలన్న డ్రీమ్‌తో ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. తొలి రెండు ప్రయత్నాల్లో యాదవ్ విఫలమైంది. కానీ మూడవ ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్ష క్లియర్ అయ్యింది.
యూపీఎస్సీ పరీక్షలో విశాఖా యాదవ్ 2025 మార్కులకు గాను 1046 స్కోర్ చేసింది. దేశంలో ఆరవ ర్యాంక్ సాధించింది. 1994లో ఆమె జన్మించింది. ఆమె తండ్రి రాజ్కుమార్యాదవ్ ఓ సబ్ ఇన్స్పెక్టర్. తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.
Privileged with an opportunity to extend a warm welcome to The Hon’ble Prime Minister in PapumPare district on his visit to the State. pic.twitter.com/7w3lSP6uQv
— Vishakha Yadav (@yadavVish21_IAS) September 25, 2025