భోపాల్: వరద ముంపు ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన శివపురి జిల్లాలో పలువురు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. దీంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎత్తైన భవనాలు, నీట మునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తాడు సహాయంతో హెలికాప్టర్లోకి చేర్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐఏఎఫ్ షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
#WATCH | Madhya Pradesh: Indian Air Force continues to carry out rescue operations in flood-hit Shivpuri district. pic.twitter.com/qnx667X5oV
— ANI (@ANI) August 5, 2021