Kirana Hills | న్యూఢిల్లీ, మే 12: పాకిస్థాన్‌లో అణ్వాయుధ కేంద్రంగా చెబుతున్న కిరానా హిల్స్‌పై తాము దాడి చేయలేదని భారత వైమానిక దళం సోమవారం స్పష్టం చేసింది. కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై ఎయిర్‌మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ ‘మేము కిరానా హిల్స్‌పై ఎలాంటి దాడి చేయలేదు. అక్కడ ఏముందో మాకు తెలియదు. మేమైతే దాడి చేయలేదు. అయితే అక్కడ అణ్వాయుధ కేంద్రం ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు’ అని ఆయన చెప్పారు.
కిరానా కొండలు పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక రిజర్వేషన్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందాయి. అక్కడి పర్వతాలలోని గుహలలో అణ్వాయుధాలను నిల్వ చేసి ఉంచారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.