Tejpratap Yadav : బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహాలం మరింత ఊపందుకుంటున్నది. ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల కోసం సన్నద్ధం కావడంలో బిజీబిజీగా ఉన్నాయి. ప్రధాన పార్టీలైతే ఏకంగా ప్రచారాలే మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇటీవల ఆర్జేడీ (RJD) నుంచి, లాలూ కుటుంబం నుంచి బహిష్కరణకు గురై, జన్‌శక్తి జనతాదళ్ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు.
తాను స్థాపించిన జన్‌శక్తి జనతాదళ్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తేజ్‌ప్రతాప్ యాదవ్ అన్నారు. ఎలాంటి ఆహ్వానం లేకున్నా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి తన పార్టీలో చేరుతున్నారని అన్నారు. తాను ఎల్లుండి (సోమవారం) జన్‌శక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని, ఆ రోజంతా జోర్దార్గా ఉంటదని చెప్పారు. తాను మహువా నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిపారు.