Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి బుధవారం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈడీ అరెస్టుకు ముందు ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ వీడియో సందేశం విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈడీ తనను అరెస్ట్ చేయబోతుందని, అరెస్టుతో తాను ఆందోళన చెడం లేదని తెలిపారు. తాను శిబు సోరెన్ కుమారుడినని.. అందుకే తాను ఆందోళన చెందడం లేదని చెప్పారు. రోజంతా విచారణ తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా నన్ను అరెస్టు చేయాలని ఈడీ నిర్ణయించిందని, ఈడీ వద్ద ఇంకా ఖచ్చితమైన ఆధారాలు లేవని ఆయన వీడియో సందేశంలో స్పష్టం చేశారు.
ఢిల్లీ నివాసంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నా ప్రతిష్టను దిగజార్చేందుకు సైతం ప్రయత్నించారని ఆరోపించారు. పేదలు, గిరిజనులను అణచివేసే వారికి వ్యతిరేకంగా నిలబడాల్సి ఉందన్నారు. దోపిడికి వ్యతిరేకంగా కొత్త పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోరెన్‌ను రిమాండ్‌ను కోరే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి ఏడు గంటల విచారణ అనంతరం ఈడీ బృందం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది.
అంతకు ముందు ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సీఎం హేమంత్ గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. హేమంత్ అరెస్టును వాయిదా వేసేందుకు శాయశక్తులా ప్రయత్నించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈడీ ఇచ్చిన అరెస్ట్ మెమోపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన తర్వాతే ఆయన మెమోపై సంతకం చేశారు. అరెస్టు తర్వాత, ఈడీ ఆయనను ఆరోగ్య పరీక్షను చేసింది. అరెస్టుకు అసెంబ్లీ స్పీకర్ అనుమతి తప్పనిసరి కావడంతో రాజీనామాను సమర్పించారు. క్రిమినల్ కేసులో సీఎంను అరెస్ట్ చేయాలంటే అసెంబ్లీ స్పీకర్ అనుమతి తప్పనిసరి. సమాచారం సైతం అందించాల్సి ఉంటుంది. ఈడీ సోరెన్‌ను అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత గవర్నర్ వద్దకు తీసుకెళ్లింది. ఆయన రాజీనామా చేసిన తర్వాతే అరెస్టు చేసింది.
#WATCH | Former Jharkhand CM Hemant Soren before his arrest by ED yesterday said, “Most probably ED will arrest me today, but I am not worried as I am Shibu Soren’s son…After a full day of questioning, they decided to arrest me in matters which are not related to me. No… pic.twitter.com/8c3b19yyOL
— ANI (@ANI) February 1, 2024