Dilip Tirkey : భారత సాయుధ దళాలు (Indian Armed Forces) చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ను హాకీ ఇండియా (Hockey India) అధ్యక్షుడు, భారత హాకీ టీమ్ (Indian Hockey team) మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ (Dilip Tirkey) హర్షం వ్యక్తం చేశారు. భారత సైనిక బలగాల వెనుక మనమంతా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తెల్లవారుజామునే పాకిస్థాన్లోని పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సేనల (Indian Forces) ను తాను అభినందిస్తున్నానని అన్నారు.
అదేవిధంగా భారత ప్రభుత్వానికి దిలీప్ టిర్కీ ఒక విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరలో పాకిస్థాన్లో మిగిలిన ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను కూడా ధ్వంసం చేయాలని టిర్కీ ప్రభుత్వాన్ని కోరారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇది అసలైన నివాళి అని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఇవాళ ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.