Ashok Gehlot | రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ( Ashok Gehlot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని (Chief Ministers post) వదులుకోవాలని భావిస్తున్నానని.. అయితే ఆ పదవి తనను వదిలి పెట్టడం లేదన్నారు. సోమవారం జైపూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని నా మనసులో ఉంది. కానీ, ఆ పదవి నన్ను వదిలి పెట్టడం లేదు. ప్రతి మాట ఆలోచించిన తర్వాతే మాట్లాడుతున్నాను. సీఎం పదవిని వదిలేస్తానని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అయితే, ఈ విషయంలో పార్టీ కేంద్ర అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’ అని గెహ్లోత్ చెప్పుకొచ్చారు.
సోనియా గాంధీ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేశారని ఈ సందర్భంగా గెహ్లోత్ తెలిపారు. ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే విజన్ 2030ని అమలు చేస్తామన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే రాజస్థాన్ బలమైన రాష్ట్రంగా ఎదిగిందన్నారు.
Also Read..
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా
Uniform Civil Code: యూసీసీకి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం