Dmitry Glukhovsky | ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకించిన రష్యన్ రచయిత.. 8 ఏండ్ల జైలుశిక్ష విధించిన కోర్టు
ఉక్రెయిన్‌పై (Ukraine War) రష్యా దాడిని ఖండించిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత (Russian Writer) దిమిత్రి అలెక్సీవిచ్ గ్లుఖోవ్స్కీకి (Dmitry Glukhovsky) రష్యా కోర్టు జైలు శిక్ష విధించింది.
మాస్కో: ఉక్రెయిన్‌పై (Ukraine War) రష్యా దాడిని ఖండించిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత (Russian Writer) దిమిత్రి అలెక్సీవిచ్ గ్లుఖోవ్స్కీకి (Dmitry Glukhovsky) రష్యా కోర్టు జైలు శిక్ష విధించింది. గత నెలాఖరులో ఉక్రెయిన్ రేవుపట్టణమైన ఒడెసాపై (Odesa) రష్యా సైన్యం దాడికి పాల్పడింది. ఈ సందర్భంగా దాడిని ఖండిస్తూ ‘Bi***es’ అనే క్యాప్షన్‌తో ఒడెసాకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించిన రష్యన్ కోర్టు దిమిత్రికి ఎనిమిదేండ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆయనను ‘విదేశీ ఏజెంట్’ (Foreign agent) అని ప్రకటించింది.
కాగా, ఈ నెల 5న రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు, అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అయిన అలెక్సీ నావల్నీకి 19 ఏండ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాద ఆరోపణలపై సరైన ఆధారాలు లేకుండానే నావల్నీని రష్యా కోర్టు దోషిగా తేల్చడం విశేషం. వివిధ ఆరోపణలపై ఆయన ఇప్పటికే 9 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా ఇప్పుడు మరో 19 ఏండ్లు శిక్షపడింది. అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఏదో ఒక ఆరోపణలపై జైలుకు వెళ్లడం రష్యాలో సాధారణమైపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

