Mamata Banerjee: ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను ప్రపోజ్ చేశా.. కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చారు: సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee: ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని తెలిపారు.
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున.. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె ఇవాళ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని అభ్యర్థిగా మీ కూటమి తరపున ఎవరు ఉంటారని అందరూ అడుగుతున్నారని, అందుకే ఖర్గే పేరును సూచించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. మంగళవారం జరిగిన ఇండియా కూటమి భేటీలోనూ ఖర్గే పేరు ప్రస్తావనకు వచ్చింది.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పీఎం అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఖర్గే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తానో ఫైటర్‌ను అంటూ ఖర్గే చెప్పుకున్నట్లు సమాచారం ఉంది. తాను ఓ ఫైటర్‌ను అని, అణగారిన వర్గానికి చెందిన వ్యక్తినో లేక దళితుడినో అని చెప్పుకుని రాజకీయాలు చేయలేదని, జీవితం మొత్తం సమానత్వం కోసం పోరాడినట్లు ఇండియా కూటమి సభ్యులతో ఖర్గే చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం కుల నేత తానేమీ పోరాటం చేయలేదన్నారు. ముందుగా మోదీని ఓడించేందుకు కృషి చేస్తానని, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థి అంశంపై చర్చ చేపడుతామని ఖర్గే అన్నారు.
#WATCH | On PM face for INDIA bloc, TMC’s Mamata Banerjee says, “I have proposed Congress President Mallikarjun Kharge’s name. Arvind Kejriwal supported my proposal.” pic.twitter.com/73pS7xTPrW
— ANI (@ANI) December 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

