Lathi charge : శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్దఎత్తున గుమిగూడి ఆందోళనలకు దిగారు. ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని అదుపుచేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని రాయ్‌బరేలీ (Raibarely) సిటీలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత రాయ్‌బరేలీలోని ‘ఆలా హజరత్ దర్గా’ ముందు, అదేవిధంగా ఐఎంసీ చీఫ్ మౌలానా తాఖీర్ రజా ఖాన్ ఇంటి ముందు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ‘ఐ లవ్ మహమ్మద్’ అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఆందోళనల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దాంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | Visuals from the ‘I Love Mohammad’ protests in Bareilly, UP, after Police deployed lathi charge as protestors pelted stones during the protests after the Friday prayers. pic.twitter.com/3SAb9HFLug
— ANI (@ANI) September 26, 2025
#WATCH | Protestors gathered outside Ala Hazrat Dargah & IMC chief Maulana Tauqeer Raza Khan’s house holding ‘I Love Mohammad’ placards after the Friday prayers in Bareily, UP. Heavy security is deployed at both spots. pic.twitter.com/rcZSAQyH8S
— ANI (@ANI) September 26, 2025