Viral video: కేంద్రమంత్రి సింధియాతో రొమేనియా మేయర్ వాగ్వాదం.. ఎందుకో తెలుసా..?
Jyotiraditya Scindia: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రొమేనియా మేయర్ వాగ్వాదానికి దిగారు. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న రొమేనియాకు చేరుకుని, స్వదేశానికి రావడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులను
న్యూఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రొమేనియా మేయర్ వాగ్వాదానికి దిగారు. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న రొమేనియాకు చేరుకుని, స్వదేశానికి రావడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులను ఉద్దేశించి సింధియా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థులతో సింధియా గొప్పలు పోవడంతో రొమేనియా మేయర్ గొడవకు దిగారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులు రోడ్డు మార్గాన పొరుగు దేశాలకు చేరుకుని.. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేందుకు సహాయక శిబిరాల్లో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం సింధియా సహా నలుగురు మంత్రులను విద్యార్థుల సహాయార్థం ఆయా దేశాలకు పంపింది. సింధియా రొమేనియాకు వెళ్లారు. ఈ సందర్భంగా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని ఓ సహాయక శిబిరంలో ఉన్న భారత విద్యార్థులను ఉద్దేశించి సింధియా ప్రసంగించారు.
బాధిత విద్యార్థులను క్షేమంగా ఇండ్లకు చేర్చడం కోసం కేంద్రం అన్ని విధాలా చర్యలు చేపడుతున్నదని, మీ అందరినీ స్వేదేశానికి చేర్చడానికే తాను వచ్చానని సింధియా చెప్పారు. కేంద్రం గురించి మరిన్ని గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ఆగ్రహించిన రొమేనియా మేయర్.. సింధియా ప్రసంగానికి అడ్డుతగిలారు. అసందర్భ ప్రసంగం వద్దని హెచ్చరించారు.
అందుకు సింధియా స్పందిస్తూ.. నేనేం మాట్లాడాలో నాకు తెలుసు అన్నారు. దాంతో మరింత ఆగ్రహించిన రొమేనియా మేయర్.. వాళ్లకు (విద్యార్థులకు) ఆశ్రయం ఇచ్చింది నేను, అన్నం పెట్టింది నేను, సాయం చేసింది నేను, ముందుగా వాళ్లను ఎప్పుడు ఇండ్లకు చేరుస్తారో చెప్పు అని మండిపడ్డారు. దెబ్బకు దిగొచ్చిన సింధియా క్షమాపణ కోరారు. విద్యార్థులకు తరలింపులో సాయం చేస్తున్న రొమేనియా సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
Jumlas can work in India, but not on foreign soil. See how Romanian Mayor schooled the Civil Aviation Minister Jyotiraditya ScIndia at a relief camp.
– Explain to them when they will leave home. I provided them shelter & food, not you!
.. students clap! 👏 pic.twitter.com/Shu4wUFtpA
— Salman Nizami (@SalmanNizami_) March 3, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

