Shatrughan Sinha : ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150-200 సీట్లు కూడా రావని అలనాటి బాలీవుడ్ నటుడు, అసన్సోల్ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శతృఘ్న సిన్హా జోష్యం చెప్పారు. ఈసారి గెలుపు ఇండియా కూటమిదేనని ధీమా వ్యక్తంచేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మోదీకి, న్యాయానికి మధ్య పోరు జరుగుతోందని అన్నారు.
ప్రధాని మోదీ గడిచిన రెండు లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని శతృఘ్న సిన్హా విమర్శించారు. దాంతో మోదీ క్రెడిబిలిటీని కోల్పోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 150-200 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు.