Amith Shah : పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ నేత సువేంధు అధికారి (Suvendu Adhikari) పేరు ఖరారయ్యింది. ఇవాళ కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) సమావేశమై సువేందును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ బీజేఎల్పీ (BJLP) సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. బీజేపీ కేంద్ర పరిశీలకుడి హోదాలో హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు సువేంధును బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్న అనంతరం.. అమిత్ షా ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జి నేతృత్వంలోని అధికార టీఎంసీ ఓటమిపాలైంది. ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. అందులోభాగంగా ఇవాళ బెంగాల్లో నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలతో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర పరిశీలకుడిగా పంపింది. సమావేశంలో ఎమ్మెల్యేలు అందరూ కలిసి సువేందు అధికారిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.