న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి దీటుగా నిలబడలేకపోతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కోలుకోవటంపై అనుమానం వ్యక్తం చేశారు.
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా కోలుకునేలా కనిపించటం లేదని అన్నారు. కూటమిలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. ‘ఇండియా కూటమి బలహీనంగా కనిపిస్తున్నది. పుంజుకోవడానికి సమయం పడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.