సోమవారం 08 మార్చి 2021
National - Nov 30, 2020 , 17:10:00

నేను శివ‌సేన‌లో చేర‌డం లేదు: ఊర్మిళ‌

నేను శివ‌సేన‌లో చేర‌డం లేదు: ఊర్మిళ‌

ముంబై: తాను శివ‌సేన‌లో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించింది బాలీవుడ్ న‌టి ఊర్మిళ మ‌టోండ్క‌ర్‌. మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే స‌మ‌క్షంలో ఆమె శివ‌సేన‌లో చేర‌నున్న‌ట్లు సోమ‌వారం ఉదయం వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇదే అంశంపై తాము ఊర్మిళ‌ను ప్ర‌శ్నించిన‌ప్పుడు.. తాను శివ‌సేన‌లో చేర‌డం లేదు అని స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు డీఎన్ఏ ప‌త్రిక వెల్ల‌డించింది. 2019లో కాంగ్రెస్ త‌ర‌ఫున ముంబై నార్త్ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ‌.. త‌ర్వాత ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పింది. తాజాగా ఆమె ఉద్ధ‌వ్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడైన హ‌ర్ష‌ల్ ప్ర‌ధాన్ వెల్ల‌డించిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంతేకాదు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఊర్మిళ పేరును కూడా ప్ర‌తిపాదిస్తూ గ‌వ‌ర్న‌ర్ బీఎస్ కోషియారీకి ఆమె పేరును పంపిన‌ట్లు కూడా అందులో ఉంది. కానీ తాను మాత్రం శివ‌సేన‌లో చేర‌బోవ‌డం లేద‌ని ఊర్మిళ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

VIDEOS

logo