Srinidhi Chidambaram : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి సంబురాలు చేసుకోవాల్సిన సందర్భాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి సీ చిదంబరం (C Chidambaram) కోడలు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) కార్తి చిదంబరం (Karti Chidambaram) సతీమణి శ్రీనిధి చిదంబరం (Srinidhi Chidambaram) అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని తాను అనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవాళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి తిరిగి వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ఆమెను పలుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నా’ అని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవి సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భాలని అన్నారు. జనం ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. తాను ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం అనుకుంటున్నానని అన్నారు.\
#WATCH | Congress MP Karti Chidambaram’s wife Srinidhi says, “I cast my vote. I think all election days are days of celebration. I think it’s a victory of democracy… I am happy that people are coming and voting…” https://t.co/WhyFmXgCu1 pic.twitter.com/R6mI17o1R8
— ANI (@ANI) April 23, 2026