విరాళాల దుర్వినియోగం నాకు తెలుసు.. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీకి సంబంధించి అనేక విషయాలు తనకు తెలుసునని బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్నో, జూన్ 11: అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీకి సంబంధించి అనేక విషయాలు తనకు తెలుసునని బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం దీని గురించి మాట్లాడటానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. బుధవారం ఆయన విష్ణోహార్పూర్లోని తన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘అటు వైపు చాలా శక్తివంతమైన వ్యక్తులున్నారు. నేను నిజాలు మాట్లాడితే చిక్కుల్లో పడటం ఖాయం’ అని అన్నారు.
రామ మందిరం కోసం కానుకల రూపంలో వచ్చిన కోట్ల రూపాయలు కనిపించకుండా పోయాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాలు విషయాన్ని సుమోటాగా స్వీకరించి, విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. రామ మందిరానికి అకౌంట్స్ ఇన్చార్జిగా పనిచేశానని చెప్పుకొంటున్న మహిపాల్ సింగ్, విరాళాల సేకరణలో చాలా కాలంగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడంతో కుంభకోణం మరింత తీవ్రమైంది. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినందుకే తనను పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

