Married For 45 Years | నాకు పెళ్లై 45 ఏండ్లకుపైగా అయ్యింది.. ఎప్పుడూ కోపగించుకోలేదు: జగదీప్ ధంఖర్
married man | గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభలో గురువారం కాస్త నవ్వులు వెల్లివిరిశాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్, బుధవారం కోపంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు.
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభలో గురువారం కాస్త నవ్వులు వెల్లివిరిశాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్, బుధవారం కోపంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. దీంతో కొంత మంది సభ్యులు నవ్వుకున్నారు. ధంకర్ కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘నాకు పెళ్లై 45 ఏండ్లు దాటింది (Married For 45 Years). నేను ఎప్పుడూ కోపంగా లేను’ అని అన్నారు. దీంతో సభ మరోసారి నవ్వులతో మారుమోగింది.
కాగా, ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం గురించి ధంకర్ ప్రస్తావించారు. ‘చిదంబరం చాలా విశిష్టమైన సీనియర్ న్యాయవాది, ఆయనకు ఇది తెలుసు. సీనియర్ న్యాయవాదిగా, కనీసం అధికార యంత్రాంగంపై కోపాన్ని చూపించే హక్కైనా మాకు లేదు. మీరు (ఖర్గే) కూడా ఒక అధికారే సార్’ అని అన్నారు. అలాగే తాను కోపగించుకున్నానన్న వ్యాఖ్యను ఖర్గే సవరించుకోవాలని కోరారు.
మరోవైపు ఖర్గే బదులిస్తూ.. ‘మీరు దానిని (కోపాన్ని) చూపించరు. కానీ లోపల మాత్రం కోపంగా ఉంటారు’ అని అన్నారు. దీంతో రాజ్యసభలో మరోసారి నవ్వులు హోరెత్తాయి. రాజ్యసభ చైర్మన్ ధంకర్ కూడా నవ్వుకున్నారు. అనంతరం మణిపూర్ అంశంపై సభలో చర్చకు ఖర్గే పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చర్చకు సంబంధించిన 267, 176 నిబంధనలపై ఖర్గే, ధంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

