Medchal : పేదల ఇళ్లపై కాంగ్రెస్ బుల్డోజర్ ప్రతాపం చూపుతూనే ఉంది. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని 376, 377, 293, 202 సర్వే నెంబర్లలో రెవెన్యూ అధికారులు జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను నేలమట్టం చేశారు.
తమకు గూడు లేకుండా చేయవద్దని బాధితులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టవద్దని బాధితులు రోదించినా ఫలితం లేకుండా పోయింది. అడ్డుపడిన బాధితులను పక్కకు ఈడ్చిపారేసి మరీ వారి ఇళ్లను కూలగొట్టారు.
పేదల ఇళ్లపై కాంగ్రెస్ బుల్డోజర్
భారీ పోలీస్ బందోబస్తు మధ్య పేదల ఇళ్లను నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని 376, 377, 293, 202 సర్వే నెంబర్లలో జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చేసిన రెవెన్యూ అధికారులు
రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లను… pic.twitter.com/92ALNgoU87
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2025