Jaipur Express | జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. హైదరాబాద్ వాసి మృతి
Jaipur Express | హైదరాబాద్ : రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నిన్న తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
Jaipur Express | హైదరాబాద్ : రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నిన్న తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్ ఘాట్‌కు చెందిన సయ్యద్ సఫియుల్లా ఉన్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ కోరారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఆటోమేటిక్ వెపన్తో కాల్పులకు పాల్పడిన విషయం విదితమే. చేతన్ సింగ్ మొదట బీ5 కోచ్‌లో ఉన్న సీనియర్ అధికారి ఏఎస్ఐ టికా రామ్ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరపడంతో, వారు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దహిసర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు చేతన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

