హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్లో హైదరాబాద్ జవాను సురీందర్ సింగ్ మృతి చెందాడు. హైదరాబాద్లోని శాలిబండ ప్రాంతానికి చెందిన సిఆర్పిఎఫ్ (CRPF) హెడ్ కానిస్టేబుల్ సురీందర్ సింగ్ జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు.
గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని జైనాపురలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. అయితే హాస్పిటల్కు చేరుకునేసరికి సురీందర్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.