సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో దిగ్భ్రాంతికర హత్య వెలుగు చూసింది. ఓ డైటీషియన్‌ను ఆమె భర్త చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పరారీలో ఉన్న విశాల్ సాల్వి(40) నాలుగు రోజుల క్రితం తన భార్య శిల్ప సాల్వి(39) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే విశాల్ ఇంట్లో అతడు రాసిన ఒక నోట్ పోలీసులకు అనుమానం తెప్పించింది.
తానొక ఘోరమైన తప్పు చేశానని.. శిల్ప బతికి లేదని అతడు ఒప్పుకొన్నట్టు అందులో ఉన్నది. దీంతో పోలీసులు నిందితుడికి చెందిన ఓ పాత ఇంట్లో సోదాలు నిర్వహించగా… అక్కడ చెక్కపెట్టెలో సిమెంట్ సీలింగ్ చేసిన శిల్ప శవం కనిపించింది. పోలీసులు ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. శిల్పకు వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతోనే ఆమెను విశాల్ హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.