జైపూర్: యూపీలో నేవీ మర్చంట్ అధికారిని అతడి భార్య ముక్కలు చేసిన ఘటన మరువక ముందే వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన మరో భార్య ఉదంతం జైపూర్‌లో వెలుగుచూసింది. ధన్నాలాల్ అనే వ్యక్తికి గోపాలి దేవితో వివాహమైంది. అయితే ఆమె ప్రియుడు దీన్‌దయాల్‌తో వివాహేతర సంబంధం సాగిస్తుండేది.
అయితే భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆరా తీయగా, ప్రియుడు దీన్‌దయాల్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీనిపై ప్రశ్నించిన అతడిపై వీరిద్దరూ రాడ్‌తో దాడి చేసి హతమార్చారు. అనంతరం ధన్నాలాల్ మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచిన గోపాలిదేవి.. ప్రియుడి బైక్‌పై దానిని పట్టపగలు నిర్జన ప్రదేశంలోకి తరలించారు. రోడ్డు పక్కన మృతదేహాన్ని దహనం చేస్తుండగా, ఎవరో రావడంతో పరారై తర్వాత పట్టుబడ్డారు.