న్యూఢిల్లీ: త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 హెలికాప్టర్ 2021 డిసెంబర్ 8వ తేదీన ప్రమాదానికి(Helicopter Crash) గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మొత్తం 12 మంది మరణించారు. బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కూనూరులో ఆ ఘటన జరిగింది. ఆ ప్రమాదం పట్ల రక్షణశాఖ స్థాయి సంఘం కమిటీ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
మానవ తప్పిదం వల్ల ఎంఐ-17 హెలికాప్టర్ కూలినట్లు రిపోర్టులో వెల్లడించారు. 2017 నుంచి 2022 వరకు భారతీయ వైమానిక దళానికి చెందిన 34 ప్రమాదాలు జరిగినట్లు స్టాండింగ్ కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక 2021-2022లో జరిగిన 9 ప్రమాదాల్లో.. డిసెంబర్ 8వ తేదీన మానవ ప్రమాదం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిపారు.