భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోని ఏసీలో మంటలు చెలరేగాయి. (Fire Erupts At Hospital) గమనించిన సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఐసీయూతోపాటు అన్ని వార్డుల్లో ఉన్న సుమారు 200 మంది రోగులను రక్షించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. గజ్రా రాజా మెడికల్ కాలేజీలో భాగమైన కమలా రాజా హాస్పిటల్లో ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. గైనకాలజీ విభాగంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోని ఎయిర్ కండిషనర్‌లో మంటలు చెలరేగాయి.
కాగా, మంటలు, పొగలు గమనించిన ఆసుపత్రి గార్డులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కిటికీలు పగులగొట్టి ఐసీయూలోని 13 మంది రోగులను బయటకు తెచ్చారు. అలాగే అన్ని వార్డులతో సహా సుమారు 200 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వారిని తరలించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Fire erupted at the maternity ward of Kamla Raja Hospital in Madhya Pradesh’s Gwalior at nearly 1 am on Sunday. The cause of the fire was believed to be an electrical short circuit.
Nearly 150 patients were shifted elsewhere as the fire tenders rushed to control the blaze.… pic.twitter.com/6yYwHQs9qF
— Vani Mehrotra (@vani_mehrotra) March 16, 2025