Huge fire | ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం (Huge fire) సంభవించింది. ఓ లేడీస్ హాస్టల్ (Girls Hostel)లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
గ్రేటర్ నోయిడా (Greater Noida)లోని నాలడ్జ్ పార్క్ 3 (Knowledge Park-3) సమీపంలోగల అన్నపూర్ణ గర్ల్స్ హాస్టల్లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏసీ పేలుడు (AC blast) కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో హాస్టల్లో చాలా మంది బాలికలు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంతో వారంతా బాల్కనీల నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇద్దరు విద్యార్థులు మాత్రం రెండో అంతస్తులో చిక్కుకుపోయారు. స్థానికులు నిచ్చెన సాయంతో వారిని రక్షించారు. ఈ క్రమంలో ఓ బాలిక కిందకు దిగుతుండగా జారి పడిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు.. వీడియోలు
Mamata Banerjee | నేను రాయల్ బెంగాల్ టైగర్ని.. నిరసనకారులకు ధీటుగా బదులిచ్చిన దీదీ