లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటలకు గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కులో ఘజియాబాద్ సమీపంలోని భోపురా చౌక్ వద్ద ఒక్కసారిగా పేలుడు (Cylinders Blast) సంభవించింది. క్షణాల్లో ఒకదాని తర్వాత మరొకటి 50 సిలిండర్ల పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డారు. సిలిండర్ల పేలుడు శబ్ధం రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపించింది. పేడుతో సిలిండర్లు చల్లాచదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పేలుడు ధాటికి ఓ ఇల్లు, గోదాము ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. పేలుడు శబ్ధంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. ట్రక్కులు 100కుపైగా సిలిండర్లు ఉన్నాయన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
After fire in #truck there was continuous #Cylinder #blast in #loni #Ghaziabad#accident pic.twitter.com/jkDEGHvkOv
— Pramod kumar yadav (@JournOOO) February 1, 2025
Ghaziabad- Blast in a truck filled with LPG cylinder on Bhopura Chowk Delhi Wazirabad Road
The area resonated with the explosion
Glasses of the houses nearby also break from the blast
▪️ Fire Brigade has reached the spot #Ghaziabad #UP #blast @ghaziabadpolice @Uppolice pic.twitter.com/JfiHSySnGi— भारतवर्ष समाचार 24 | Bharatvarsh samachar 24 (@BVS24tv) February 1, 2025